తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పైన ప్రసంగించబోతున్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు మంత్రికి హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఇప్పటికే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ ప్రారంభమయింది. ఈనెల 20వ తేదీన మంత్రి కేటీఆర్ ఇండియా @2030 – ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ అనే అంశం పైన తన ఆలోచనలను పంచుకోనున్నారు. 20వ తేదీన సాయంత్రం 6.30కు మంత్రి ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.
ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి వేగంగా జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్ మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు. తన ప్రసంగంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల్లో విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు.
Elated to have the H’ble Minister @KTRTRS deliver a keynote address at the conf! We look forward to hearing from him on the development he has undertaken in the State of Telangana and his views on Turbocharging India @ 2030!
Free & virtual, register here https://t.co/6jZd0mhROm pic.twitter.com/PXLZerDyoQ
— India Conference at Harvard (@HarvardIndiaCon) February 18, 2022
తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.