ప్రపంచ వ్యాప్త వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఇండో ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ కంక్లేవ్‌లో ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుల్ లేనైన్తో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన ప్రభుత్వ విధానాలు చేపట్టిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ విధానం ఇప్పటికే విజయవంతమై వేలాది పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలను తెలంగాణకు తీసుకొచ్చిందన్నారు.