KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విజయదశమి స్ఫూర్తితో మీరు చేసే మంచి పనులన్నింటిలో విజయం కలగాలని ఆశిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
విజయదశమి స్ఫూర్తితో మీరు చేసే మంచి పనులన్నింటిలో విజయం కలగాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు
— KTR (@KTRBRS) October 23, 2023