KTR | శతాబ్దానికి ఒక్కడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు : మంత్రి కేటీఆర్
KTR | శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు.. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, ప్రజలు మంచిగానే ఉన్నారని, మధ్యలో ఉన్న తెల్ల అంగీలు వేసుకునే రాజకీయ నాయకులతోనే సమస్య ఉందని ఓ పెద్దాయన చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు.. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, ప్రజలు మంచిగానే ఉన్నారని, మధ్యలో ఉన్న తెల్ల అంగీలు వేసుకునే రాజకీయ నాయకులతోనే సమస్య ఉందని ఓ పెద్దాయన చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కేటీఆర్ ఏం చెప్పారంటే.. సిరిసిల్లలో శంకరయ్య అని ఓ పెద్ద మనిషి ఉంటడు. ఆయనను మొన్న అడిగిన.. ఎట్లున్నది సర్.. ఎలక్షన్లు వచ్చినవి కదా అని అడిగిన. ఆయన నవ్వుకుంటూ ఇట్ల చెప్పిండు. మీరు ఏం అనుకోరు కదా నేను చెప్తే అన్నడు.. నేనేం అనుకోననని చెప్పిన. సర్ నిజంగా చెప్తున్నా.. పైన కేసీఆర్ మంచిగనే ఉన్నడు.. కింద ప్రజలు మంచిగనే ఉన్నరు. ఆయనకు, వాళ్లకు లింకుంది. మధ్యల మీ తెల్ల అంగిలు వేసుకున్నోళ్లతోనే సమస్య ఉంది సర్ అని చెప్పిండు. రాజకీయ నాయకులతోనే, మధ్యల ఉన్నోళ్లతోనే సమస్య ఉంది సర్ అని చెప్పిండు. అలుగుడు గులుగుడు ఏమన్న ఉంటే మీ దగ్గర్నే ఉన్నది తప్ప.. ప్రజల్లో ఏం లేదు సర్.. ప్రజలంతా మంచిగనే ఉన్నరు. ప్రజలు సుభిక్షంగా ఉన్నరు. రైతులు, మహిళలు, దివ్యాంగులు సంతోషంగా ఉన్నరు. కేసీఆర్ పరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నరు. ఏమన్న పంచాయితీ ఉంటే రాజకీయ నాయకుల్లోనే ఉంది. నాకు పదవి రాకపాయే అంటే, నాకు టికెట్ రాకపాయే అనే బాధ తప్ప వేరేది మాత్రం ఏం లేదు సర్ అని చెప్పిండు అని కేటీఆర్ వెల్లడించారు.
ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే.. రాజకీయాలు, ఎన్నికలు వస్తయ్ పోతయ్.. కానీ శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు. మంచి చేసే ప్రభుత్వాన్ని పొగొట్టుకుంటే.. జేబులో ఉన్న కడక్ వంద రూపాయాల నోటును పారేసి, రోడ్డు మీదున్న చిల్లర ఏరుకునే బుద్ధి తక్కువ పని అయితది. జేబుల ఉన్న కడక్ వంద నోటును ఎవడైనా పారేసుకుంటారా..? కానీ కింద చిల్లర ఉందని ఏరుకుంటే ఏమైతది. ఇది, అది పోతది.. ఎటు కాకుండా నాశనమైతది అని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

