Kala Chashma | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన మనసుకు నచ్చిన కథనాలను, వీడియోలను షేర్ చేస్తూ వారిని అభినందింస్తుంటారు. ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. అలా వారిలో ఉత్సాహాన్ని నింపుతూ.. ప్రోత్సాహం కల్పిస్తారు కేటీఆర్.
తాజాగా కాలా చస్మా సాంగ్‌కు ఆఫ్రికన్ పోరగాళ్లు అదరగొట్టే స్టెప్పులేశారు. లిరిక్కు, మ్యూజిక్కు తగ్గట్టుగా స్టెప్పులేయడంతో ఆ ఆఫ్రికన్స్ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ వీడియోను ఐఏఎఫ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఏవియేటర్ అనిల్ చోప్రా షేర్ చేయగా.. దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. తప్పకుండా ఆ పిల్లలు ఎదుగుతారని, వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆఫ్రికన్స్ అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టారని కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.
Sure to put a smile on your faces 😁
Fabulous dancers these kids https://t.co/Q6vZeZ8IOg
— KTR (@KTRTRS) August 26, 2022