KTR | పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా పురపాలక శాఖ దశాబ్ది నివేదిక : మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమైన నివేదిక అని పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉందన్నారు. పురపాలిక శాఖ దశాబ్ది నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమైన నివేదిక అని పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉందన్నారు. పురపాలిక శాఖ దశాబ్ది నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 నుంచి పట్టణాల అభివృద్ధిపై ప్రతి ఏటా జూన్‌లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ దశాబ్ది నివేదికలో 2014 నుంచి సాధించిన ప్రగతిని పొందుపరిచామన్నారు. 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చింది. కొత్త పురపాలక చట్టం తెచ్చిన సీఎం కేసీఆర్‌దే ఈ ఘనత అని తెలిపారు. తొమ్మిదేండ్లలో పురపాలక శాఖ ద్వారా రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ పదేండ్లలో 462 శాతం ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు. ఈ పదేండ్లలో చట్టబద్దంగా రావాల్సింది తప్ప కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. ఏ రంగం తీసుకున్నా గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించాం. ఈ పదేండ్లలో గణనీయమైన, గుణాత్మకమైన తేడా కనిపిస్తుందన్నారు కేటీఆర్.
నగర అభివృద్ధి కోసం అనేక ఎస్పీవీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా 35 వరకు ఫ్లై ఓవర్లు నిర్మించామని గుర్తు చేశారు. ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతుందన్నారు. తాము 35 ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయలేకపోతున్నారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని కేటీఆర్ తెలిపారు.
వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టాం. ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. 150 కాలనీలు గతంలో ముంపు వల్ల ఇబ్బంది పడేవి. ఎస్ఎన్డీపీ వల్ల ఈ ముంపు బాధ తప్పింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్లతో 19 పనులు చేపట్టాం. ఏడు పనులు పూర్తయ్యాయి. మిగతావి కూడా పూర్తి చేశాం. హైదరాబాద్ నగరంలో 2050 నాటికి తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓఆర్ఆర్ పరిధిలో కూడా నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.
సెప్టెంబర్ నాటికి ఎస్టీపీలు పూర్తి చేస్తామన్నారు కేటీఆర్. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం. అన్ని పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పట్టణాల్లో ఇంటిగ్రెటేడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే పలు చోట్ల ఈ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

