వరంగల్, మార్చి 8(నమస్తే తెలంగాణ): ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల ఆరోగ్యా న్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు మంచి పనులు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛమైన నీరు, గాలి, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధా న్యం ఇస్తున్నదని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిమ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.
వివిధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న మహిళలు, స్థానిక మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటీకి స్వచ్ఛమైన, శుద్ధిచేసిన నదీ జలాలను సరఫరా చేస్తున్నదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి హరితహారం కింద ఇప్పటికే దాదాపు 240 కోట్ల మొక్కలను నాటినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ మొత్తం రాష్ర్టాన్ని జలమయం చేశారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, కరెంటు, ధాన్యం కొనుగోళ్లు, రైతు వేదికలు ఇలా వివిధ రూపాల్లో రైతులకు భరోసా కల్పిస్తున్నదని వివరించారు.
తాము పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సొంత ఊరు ఏనుగల్‌లో ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు, డాక్టర్ హరిణి, ప్రతీక్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వారి కుటుంబసభ్యులంతా కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వారం రోజుల నుంచి వినోద్‌కుమా ర్, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులందరూ ఏనుగల్లోనే మకాం వేసి చక్కటి ఏర్పాట్లు చేశారని కొనియాడారు. స్క్రీనింగ్ తదుపరి అవసరమైతే తమ క్యాన్సర్ దవాఖానలో ఉచితంగా వైద్యం చేయించేందుకు ఫౌండేషన్ ముందుకురావడాన్ని ప్రశంసించారు.
చదువుతోనే ప్రగతి: వినోద్‌కుమార్
చదువుకుంటేనే వ్యక్తి ప్రగతి సాధ్యమవుతుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తన సోదరుడు శ్రీనివాసరావు, డాక్టర్ హరిణి, డాక్టర్ ప్రతీక్ ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. ఎంతో విలువైన పరికరాలతో మహిళలకు పరీక్షలు చేయించడమే కాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. తమ పె ద్దమ్మ, అమ్మ 20 ఏండ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయిన నేపథ్యంలో వరంగల్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సేవాభావంతో ప్రతిమా క్యాన్సర్ దవాఖాన ఏర్పాటుచేసినట్టు వివరించారు. ఏనుగల్ యువతకు చేయూతనివ్వడానికి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఏనుగల్లుకు కేటీఆర్ వరాలు
మంత్రి కేటీఆర్ ఏనుగల్కు వరాలు ప్రకటించారు. ఏనుగల్‌లో 30 పడుకల దవాఖాన, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని, గడ్డపారతండాకు నీరందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బీ శ్రీనివాసరావు, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ దయాకర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు టీ నారాయణరావు, ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ బీ హరిణి, డాక్టర్ ప్రతీక్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు టీ రవీందర్రావు, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, కుడా చైర్మన్ సుందర్రాజు, డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.