హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత మహిళా హాకీ జట్టును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒలిపింక్స్‌లో మెడల్ కోసం ఎంతో శ్రమించి, కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళలు రాణించగలరన్న నమ్మకాన్ని ప్రదర్శించి.. ఎంతో మంది బాలికలకు ప్రేరణగా నిలిచారని కేటీఆర్ కొనియాడారు.
Kudos to the entire Indian women hockey team 👏 👏
— KTR (@KTRTRS) August 6, 2021
You won a billion hearts with your amazing efforts & inspired many young girls out there to compete on world stage #Tokyo2021 pic.twitter.com/HjCcLbK3sy