హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ‘ఫిష్ ఇన్’ సంస్థ తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్’ ప్రాజెక్టుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాన్లుయెం ట్ మెడికల్’ కూడా హైదరాబాద్‌లో యూనిట్ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారా వు, గురువారం శాన్‌జోస్ నగరంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్ అండ్ డీ, డిజిటల్, టెక్ కేంద్రాల ఏర్పాటు, తయారీ కార్యకలాపాలకు హైదరాబాద్ చక్కటి ప్రాంతమని వివరించారు. జీనోమ్‌వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీల్లో అద్భుత అవకాశాలున్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ యూనిట్‌ను మిడ్ మానేరు రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటుచేయనున్నట్టు ఫిష్ ఇన్ చైర్మన్, సీఈవో మనీశ్‌కుమార్ తెలిపారు. తిలాపియా చేపల ఎగుమతిలో ఈ సంస్థ ప్రపం చ నంబర్ వన్‌గా ఉన్నది. మంత్రి కేటీఆర్‌తో గురువా రం సమావేశమైన అనంతరం రాష్ట్రంలో పెట్టుబడిపై మనీశ్‌కుమార్ ప్రకటన చేశారు. రూ.వెయ్యి కోట్లతో పూర్తిస్థాయి ‘ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో చే పల ఉత్పత్తికి హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ప్రాసెసింగ్, ఎగుమతులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కంపెనీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఏటా 85 వేల టన్నుల తిలాపియా చేపలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. సుమారు ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందని చె ప్పారు. ఫిష్ ఇన్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. మనీశ్కుమార్కు ధన్యవాదాలు తెలిపా రు. ఈ పెట్టుబడితో రాష్ట్ర మత్స్య పరిశ్రమకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అందివస్తుందని అన్నారు. ఉపాధి అవకాశాల్లో స్థానిక మత్స్యకారులకు, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యం ఇ వ్వాలని కోరారు. మనీశ్‌కుమార్ హైదరాబాద్‌కు చెం దిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత శివ్ కే కుమార్ కు మారుడు కావడం విశేషం.
అత్యాధునిక టెక్నాలజీతో ‘కాన్లుయెంట్’
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాన్లుయెంట్ మెడికల్’ హైదరాబాద్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థ చైర్మన్, సీఈవో డీన్ షావర్ గురువారం శాన్‌జోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. ‘నిటినోల్’ (నికెల్, టైటానియం మిశ్రమం)తో వైద్య పరికరాల ఉత్పత్తులకు సంబంధించి భారతదేశానికి అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయాలని భావిస్తున్నామని, ఇందుకు హైదరాబాద్‌ను తమ మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నామని డీన్ షావర్ తెలిపారు. త్వరలో పైలట్ ప్రాజెక్టుగా తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తామని, ఏడాదిలో భారీగా విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచే భారత్‌తోపాటు ఆసియాలోని తమ ఖాతాదారులకు ఉత్పత్తులను సరఫరా చేస్తామని వెల్లడించారు. బయో మెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించిన ప్రణాళికలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డీన్ షావర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో మెడ్ టెక్ ఒకటని, యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రము ఖ సంస్థలైన అపోలోమిక్స్, అర్విక్ థెరపిక్స్, చెమ్వెద లైఫ్ సైన్సెస్, అబ్వే, ప్రొటోగనిస్ట్ థెరపిక్స్, సంసరా క్యా పిటల్, స్టాన్‌ఫర్డ్ ఇండియా బయోడిజైన్, ఆర్బెస్ మెడికల్, డైస్ థెరపిక్స్, సీల్ రాక్ థెరపిక్స్, వాసా థెరపిక్స్, అరియా ఫార్మాస్యూటిక్స్, ఆటంవైజ్, గ్రీన్‌టెక్, ఫ్రజీర్ హెల్త్ సైన్సెస్, అలెక్టార్, గిలీడ్ సైన్సెస్, ఆంజియో సేఫ్, టోస్క్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.