హైదరాబాద్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (GHMC) అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు (Ward office) ప్రారంభమయ్యాయి. కాచీగూడలో (Kachiguda) వార్డు ఆఫీసును మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లలో మంత్రులు, మేయర్, అధికారులు ప్రారంభించనున్నారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. పారిశుద్ధ్యం, విద్యుత్, టౌన్‌ప్లానింగ్ వంటి వాటిపై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్నారు.
పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్షమని చెప్పారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. సిటిన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం ఉంటుందని, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Happy to initiate a new urban administrative reform to facilitate decentralisation and people-centric governance
Starting today, GHMC will have 150 ward offices which will ensure most of the basic citizen services & complaints are addressed at the ward level
Led by an… pic.twitter.com/LfaPLEhNnF
— KTR (@KTRBRS) June 16, 2023