హైదరాబాద్: పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. స్థానికంగా పెట్టుబడులు, తయారీ యూనిట్లు పెట్టేవారికోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకొచ్చామన్నారు. హైటెక్ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లైవ్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్‌లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతోపాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్ కంట్రోల్ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడులకు ఒకేఒక్క గమ్యస్థానం హైదరాబాద్ అని, ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జాన్సన్ కంట్రోల్ సంస్థ దశాబ్ద కాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నదని, హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. ఇమేజ్ టవర్స్, ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారబోతున్నదని వెల్లడించారు. ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయన్నారు.
Live: IT Minister @KTRTRS speaking at the inaugural event of @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad https://t.co/1vhUD9oqK6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2022
IT and Industries Minister @KTRTRS inaugurated the @johnsoncontrols OpenBlue Innovation Center in Hyderabad. OpenBlue Innovation Centre focuses on security products including both intrusion and access control and video surveillance (ACVS) product lines. pic.twitter.com/mNnt1vSrSy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 14, 2022