హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ తన గతస్మృతులను గుర్తుచేసుకొన్నా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో దిగిన ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్.. ‘పాత జ్ఞాపకాలు.. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలప్పుడు.. తెలంగాణ ఉద్యమంలోకి నా ప్రవేశం. నా ఎడమవైపు బైక్‌పై ఉన్నది మాజీ ఎమ్మె ల్సీ అప్పటి టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కర్నె ప్రభాకర్’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘అమెరికాలో లక్షల రూపాయల జీతం, మంచి భవిష్యత్తును వదులుకొని తండ్రి బాటలో ఉద్యమంలో ఇలా రోడ్లపైకి వచ్చారు కేటీఆర్. ఇప్పుడు కుటుంబ పాలన అని మాట్లాడే బండి సంజయ్.. రేవంత్‌రెడ్డి.. ఉద్యమంలో పాల్గొన్న మీ ఫొటోలు పోస్టు చేయండి అని సవాల్ విసిరారు. ‘ఉద్యమంలో రామన్న.. జై తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చిం ది.. అభివృద్ధి అయ్యింది. మిగిలింది ఒక్క టే.. భవిష్యత్తు జనరేషన్‌ను మార్చడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ మాట వింటే కలం పడతాం.. రెచ్చగొట్టే వాళ్ల మాటలు వింటే కత్తి పడతాం..’ ‘జనం కోసం జనం మధ్యలో రామన్న.. జై తెలంగాణ’ అంటూ నాటి కొన్ని ఫొటోలను నెటిజన్లు పంచుకొన్నారు.