Collector Mrinalini : ఈ మధ్య కాలంలో యూట్యూబ్ (YouTube) లో వీడియోలు చూస్తూ ఇంట్లోనే ప్రసవాలు (deliveries) చేసే ట్రెండ్ పెరుగుతోంది. అయితే కొన్ని రేర్ కేసుల్లో ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇదే విషయమై తమిళనాడు (TamilNadu) రాష్ట్రం అరియలూర్ (Ariyalur) జిల్లా కలెక్టర్ మృణాళిని (Mrinalini) గర్భిణీలను అప్రమత్తం చేశారు. యూట్యూబ్ చూస్తూ ఇంట్లో సొంతంగా ప్రసవాలు చేసుకోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.
అరియలూర్ జిల్లా కేంద్రంలో మహిళలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ మృణాళిని ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రులతో ప్రసవాల కోసం ఆధునిక సదుపాయలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇంట్లో యూట్యూబ్ వీడియోలను అనుసరించకుండా ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు.