హైదరాబాద్ : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతించారు. హైదరాబాద్లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈని ప్రారంభించబోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుచేసినట్లు, అక్కడ అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నేడు వాహనాల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఉపయోగం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. కంప్యూటర్ ఆన్ ఫోర్ వీల్స్గా ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందిందన్నారు.
IT & Industries Minister @KTRTRS formally inaugurated the @AdvanceAuto Parts Global Capability Center in Hyderabad today.
Tom Greco – President & CEO @AdvanceAuto Parts, @jayesh_ranjan Principal Secretary, IT Dept. were amongst the other dignitaries who graced the occasion. pic.twitter.com/TlVDcnKl4x
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 13, 2022