Actor Suriya | రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తాను ‘సింగం’ అని నిరూపించుకున్నాడు తమిళ స్టార్ నటుడు సూర్య. తనను ప్రాణప్రదంగా ఆరాధించే అభిమానుల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉంటుందో మరోసారి చాటిచెప్పారు. తాజాగా ఒక అభిమాని వివాహ వేడుకకు ఆయన స్వయంగా హాజరై అందరినీ షాక్‌కి గురిచేశాడు.
అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా భార్య కాజల్‌కు ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాజల్‌కు నటుడు సూర్య అంటే విపరీతమైన అభిమానం. ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ, సూర్యను తన పెళ్లికి ఆహ్వానించాడు అరవింద్. అయితే ఈ విషయం వధువుకు అస్సలు తెలియదు. ముందస్తు సమాచారం లేకుండా సూర్య వెడ్డింగ్ హాల్లోకి సడన్‌గా అడుగుపెట్టారు. తెలుపు రంగు దుస్తులు, కూలింగ్ గ్లాసెస్ ధరించి చాలా సింపుల్‌గా వచ్చిన ఆయనను చూడగానే వధువు కాజల్ షాక్‌కు గురైంది. తన కళ్ల ముందు ఉన్నది నిజంగానే తన ఫేవరెట్ హీరోనా కాదా అని నమ్మలేక ఆమె నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆనందంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. సూర్య స్వయంగా వధూవరుల దగ్గరకు వెళ్లి, వారి చేతులు పట్టుకుని అభినందనలు తెలిపి తన ఆశీస్సులు అందించారు. అయితే సూర్యను చూసి షాక్ అయిన వధువు రియాక్షన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
• An Unexpected Visit From @Suriya_offl Na Made Bride Happy and Memorable 😍❤️#Karuppu #Suriya47 pic.twitter.com/G8yttRom6r
— Abhimanyu (@Abhimanyu_Offl) December 27, 2025