హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం బైక్, స్కూటీ ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న విద్యార్థులు లారీ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.