హైదరాబాద్ : ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్ హాన్స్ కంపెనీని విక్రయించడం అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తోందని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ ద్వారా అనుమానాలను వ్యక్తం చేశారు. 2017లో పవన్ హన్స్ కంపెనీ విలువ రూ.3700కోట్లు అయితే అందులో 49 శాతం వాటాను కేవలం రూ.211కోట్లకు ఎలా విక్రయిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి ఎన్పీఏ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? అంటూ నిలదీశారు.