ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు.. మంత్రి కేటీఆర్ ధ్వజం
రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకుంటున్నాం అని తెలిపారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. పేదలు ఉండే ప్రాంతాల్లో ఈ ఇండ్లు నిర్మిస్తున్నాం. ముస్తాబాద్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలు ఆత్మగౌరవం బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నాం. ఈ ఇండ్లు ప్రయివేటు బిల్డర్ కడితే రూ. 20 నుంచి రూ. 25 లక్షల ఖర్చు అయ్యేది. రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? దమ్ముంటే చూపించాలని సవాల్ విసిరారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ మొండి మనిషి. ఆయన ఏ పని చేపట్టిన పూర్తయ్యేదాకా వదలరు.. కాబట్టి ప్రతీ పేద వ్యక్తికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

