శ్రీజకు అన్నివిధాలా సహకారం : కేటీఆర్
హైదరాబాద్ : యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది. ఈ సందర్భంగా సోమవారం శ్రీజ కోచ్‌తో కలిసి ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్‌ను కేటీఆర్ అభినందించారు. టేబుల్ టెన్నిస్‌ను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌పై కోచ్ సోమనాథ్ ఘోష్‌ను నియమించిన విషయం విదితమే. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రకాశ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

