హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయన తల్లి శాంతమ్మ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారు.
శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ (78)కు శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి తండ్రి నారాయణగౌడ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఒకే ఏడాదిలోనే మంత్రికి తల్లిదండ్రులిద్దరూ దూరమయ్యారు.