హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. కుటుంబపాలనపై అమిత్షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ట్వీట్ చేశారు. ‘పూర్తిగా ప్రతిభ ఆధారంగా అంచలంచెలుగా బీసీసీఐ కార్యదర్శిగా ఎదిగిన ఓ యువ క్రికెటర్ తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారు.
ఇక ఆ తండ్రి.. అన్న ఎంపీగా కొనసాగుతుండగా, భార్యను ఎమ్మెల్సీగా పోటీ చేయించిన ఒక పెద్ద మనిషి తరఫున ప్రచారం చేయడానికి వచ్చారు. అటువంటి తండ్రి.. కుటుంబపాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.