ఉప్పొంగిన అభిమానం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు వేడుకను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు.
- ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు
- రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు
- గిఫ్ట్ ఏ ైస్మెల్ కింద వాహనాలు పంపిణీ
- మొక్కలు నాటి అభినందనలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు వేడుకను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పెద్దఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడం, నిత్యావసరాలు, పండ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల దత్తత, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి.. తాడూరు, సిరిసవాడ, కుమ్మెర జెడ్పీ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి రూ.8 కోట్లు ప్రకటించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రక్తదానం శిబిరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రామవరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ రసూల్‌పురలోని పాఠశాల విద్యార్థులకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి వికలాంగ విద్యార్థులకు ఈ-వెహికిల్స్‌ను పంపిణీచేశారు.
జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్‌రెడ్డి, హేమ సామల అనాథ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రషీద్‌గూడ ప్రభుత్వ బడిని దత్తత తీసుకుంటున్నట్టు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రకటించారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన స్వచ్ఛంద సంస్థ హోప్ 4 స్పందన సహకారంతో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 10 మంది వికలాంగులకు తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల చేయూత అందించారు.
చెట్టోలే పచ్చగుండాలె
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలోని తన ఫాంహౌజ్‌లో కొబ్బరి మొక్క నాటుతున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి. అనంతరం కేటీఆర్ బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు.






Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

