హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాజకీయ పోరాటాలకు పిల్లలను దూరంగా ఉంచుదామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు, సోషల్ మీడియా సైనికులకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ నాయకుడు చేసిన ఓ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రాజకీయాల్లోకి పిల్లలను లాగడం అనాలోచితమని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. టీఆర్ఎస్ సైద్ధాంతిక విధానాలు, పనితీరు, సమస్యలపై దృష్టి సారిద్దామని ట్వీట్ చేశారు.