Minister Koppula | చెన్నమనేని రాజేశ్వర్ రావు గొప్ప నాయకుడు.. శత జయంతి వేడుకల్లో మంత్రి కొప్పుల
Minister Koppula | దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు జీవితాంతం ప్రజల కోసం పోరాడారని, ఆయన గొప్ప నాయకుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, మేధావిగా జాతీయ స్థాయిలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీతా నిలయంలో దివంగత రాజేశ్వరరావు శతజయంతి వేడుకలకు హాజరై మంత్రి ఘన నివాళులర్పించారు.
వేములవాడ: దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు జీవితాంతం ప్రజల కోసం పోరాడారని, ఆయన గొప్ప నాయకుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, మేధావిగా జాతీయ స్థాయిలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీతా నిలయంలో దివంగత రాజేశ్వరరావు శతజయంతి వేడుకలకు హాజరై మంత్రి ఘన నివాళులర్పించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాజేశ్వర్రావు పోరాటాలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని నింపాయని చెప్పారు.
వారి జ్ఞాపకాలు రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత సామాజిక వర్గంలో జన్మించినా బడుగు బలహీన వర్గాల కోసం రాజేశ్వర్రావు పోరాడారని చెప్పారు. ప్రజల కోసం ఆయన జైలు జీవితం గడిపారని తెలిపారు. చెన్నమనేని కుటుంబం చాలా గొప్పదని, చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యాసాగర్ రావు, హనుమంతరావు లాంటి నాయకులు గొప్ప సేవలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ రంగాల ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

