హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి అందజేస్తున్న విధంగా అర్హులైన మైనార్టీ వర్గాల వారికి లక్ష రూపాయలు ఆవ్యాంగులకు సైతం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. విద్య వైద్య రంగాల్లోను మైనారిటీ వర్గాల వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలతో సమానంగా మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటని విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం రూ. 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినం. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదన్నారు.
దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ ప్రకటనలు చేస్తున్నది. దేశం వెనుకబడటానికి ఆ పార్టీనే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు.