తిరుమల : తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula)శుక్రవారం
తెల్లవారు జామున తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి కుటుం సభ్యులు చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాకం (Kanipakam Temple)వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో వరసిద్ధి వినాయక స్వామి శేషవస్త్రంతో మంత్రిని సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ కాణిపాక గణనాథున్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.