హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. నూతన సచివాలయంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత ఉపాధి శిక్షణతోపాటు పలు కార్యక్రమాల పురోగతిపై కార్పొరేషన్ ఎండీ కరుణాకర్‌తో మంత్రి చర్చించారు. మంత్రి కొప్పులకు ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, జగిత్యాల జిల్లా జడ్పీటీసీ సభ్యుడు బాధిని రాజేందర్, లోక పాపిరెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.