హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): ‘అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన కడియం శ్రీహరి ముమ్మాటికీ రాజకీయ వ్యభిచారే.. కేటీఆర్ ఆయనపై చేసిన వ్యాఖ్యలు నూటి కి నూరు శాతం కరెక్టే’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశా రు. ఇటీవల కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడితే గుమ్మడికాయ దొంగ చందంగా కడియం శ్రీహరి స్పందించడం ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువల్లేని వారికి నీతులు మాట్లాడే హక్కులేదని ఆదివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించిన ఆయన కేసీఆర్, కేటీఆర్‌పై అహంకారపూరితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.