చేనేత కార్మికుల పొట్టకొట్టొద్దు
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- కేంద్రీకృత టెండర్ల నుంచి వెంటనే మినహాయించండి
- వేలాది చేనేత కుటుంబాల జీవనోపాధిని రక్షించండి
- ముఖ్యమంత్రి రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ లేఖ
- క్యాబినెట్ మంత్రి లేఖను పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు అవసరమైన వస్త్ర ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని గత నెల 16న సీఎం రేవంత్‌రెడ్డికి స్వయంగా ఆమె లేఖ రాశారు. వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోని సుమారు 5వేల మందితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సహచర మంత్రి రాసిన లేఖను కూడా రేవంత్ సర్కార్ బుట్టదాఖలు చేసింది.
‘మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నట్టుగా వ్యవహరించింది. మంత్రి సురేఖ లేఖలో ప్రభుత్వాన్ని కోరిందేమిటంటే.. మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వస్త్రోత్పత్తి రంగానికి వెన్నెముకగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థలకు కార్పెట్లు, బెడ్ షీట్లు, యూనిఫామ్‌లు చేనేత కార్మికులు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం పరిధిలోకి తేవడం వల్ల వారి ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఇటీవల కార్మికులు నిర్వహించిన ఆందోళనకు మంత్రి స్వయంగా వెళ్లి, వారి సమస్యలు పరిషరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి దయాపూర్వకంగా ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకొని అధికారులు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో సురేఖ వేడుకున్నారు.
ఈ ఆరు డిమాండ్లు నెరవేర్చండి
చేనేత కార్మికుల తరఫున మంత్రి సురేఖ ఆరు డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుపెట్టారు. ‘జీవో నంబర్ 1 ప్రకారం.. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లను కేవలం ‘టెసో’ ద్వారానే కొనుగోలు చేయాలి. ఏటా జూలై నెలలోనే టెసో సంస్థ కు కార్పెట్లు, బెడ్ షీట్ల సరఫరాకు ముందస్తు ఆర్డర్లు జారీ చేయాలి. దీనివల్ల కార్మికులకు నిరంతర ఉపాధి లభించడమే కాకుండా, పాఠశాలలు ప్రారంభమయ్యే ఏప్రిల్ నాటికే నాణ్యమైన ఉత్పత్తులు సిద్ధమవుతాయి. గత ఏడు నెలలుగా టెసో సంస్థ నుంచి చెల్లింపులు రాక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. థ్రిప్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వ వాటా పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతోపాటు గతంలో అమలైన 20శాతం నూలు సబ్సిడీని పునరుద్ధరించాలి. వరంగల్ జిల్లాలో కొత్తగా ‘యార్న్ డిపో’ను ఏర్పాటు చేయాలి’ అని సురేఖ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

