నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ గురువారం గైర్హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో ఆమె కోర్టుకు రాలేకపోయారని, కొంత సమయం కావాలని ఆమె తరఫున న్యాయవాది కోర్టును కోరారు. గైర్హాజరు పిటిషన్ను అంగీకరించిన మేజిస్ట్రేట్ శ్రీదేవి విచారణను 19కి వాయిదా వేశారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రజాప్రతినిధుల కోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు మీద ప్రత్యర్థికి అవకాశం కలించే ఉద్దేశంతో ఏసీబీ కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణల పట్ల వివరణ ఇచ్చుకునేందుకు కోర్టు వెసలుబాటు కల్పించనుంది.