హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే జ్వరం బారిన పడిన ఆమె తన కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేయడంతో డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో డాక్టర్ల పర్యవేక్షణలో మంత్రి కొండా సురేఖకు చికిత్స అందిస్తున్నారు.