హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): వన్యప్రాణుల జాబితా నుంచి కోతులను తొలగించారని, కాబట్టి జనావాసాల్లో వీటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ‘జూస్ అండ్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ’ (జాపాట్) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘జూ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. వరంగల్‌లోని కాకతీయ జూపార్కుకు రెండు తెల్ల పులులు, సింహాన్ని తెప్పించడానికి సెంట్రల్ జూ అథారిటీని అధికారులు సంప్రదించాలి’ అని సూచించారు.
రాష్ట్రంలో వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సురేఖ సూచించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌పై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ బొగ్గును ఇంధనంగా ఉపయోగించే పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు దృష్టి సారించాలని కోరారు.