హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : అటవీ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరొన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నా లుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పనులు చూసుకోవాలని సూచించారు. సోమవారం ఆమె శాసనమండలిలో పలువురి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వన్యమృగాల దాడిలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్టు వివరించారు.