నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వరుసగా రెండోసారి కోర్టుకు జమానత్లు సమర్పించలేదు.
కోర్టు ఆదేశాలను మంత్రి పట్టించుకోవడం లేదని, కావాలని కాలయాపన చేస్తున్నారని నాగార్జున తరఫు న్యాయవాది ఆరోపించారు. మంత్రి గైర్హాజరుపై ఆమె తరఫు న్యాయవాది ఇచ్చిన పిటిషన్ను ప్రజా ప్రతినిధుల కోర్టు అంగీకరించి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.