Komatireddy Venkat Reddy | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు, అనంతపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కంటే తనతోనే ఎకువమంది ఫొటోలు దిగుతారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ హాల్లో మీడియాతో చిట్‌చాట్‌లో బాలకృష్ణపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. ‘బాలకృష్ణ రోజుకొకరిని కొడతరంట కదా? అట్లాంటప్పుడు ఆయన సినిమాలు ఎవరు చూస్తరు? అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ బాగనే వస్తాయట’ అని మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా విమర్శలు చేశారు.