Minister Komatireddy | హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో/మొయినాబాద్: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సినీ పెద్దలు కోపం తెప్పించారా? మంత్రికి, సినీ పెద్దలకు మధ్య దూరం పెరిగిందా? అం దరి లెక్కలు తేలుస్తానన్న మంత్రి అ న్నంత పనీ చేశారా ? అంటే ప్రస్తుత ప రిణామాలు నిజమే కాబోలు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత తెలుగు సినీ రంగానికి చెందిన పెద్దలు ఆయన్ను కలవలేదు, అభినందించలేదు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అసహనానికి గురైనట్టు ప్రచారం జరిగింది. తనను దిల్‌రాజు మినహా ఇంకెవరూ అభినందించలేదని ఆప్పుడే తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. తాజాగా వారం క్రితం కూడా కూల్చివేతలపై హింట్ ఇ చ్చారు.
ఆక్రమణలను కూల్చివేస్తామని, ఇందులో ఎంత పెద్దవారున్నా, సినీ ప్రముఖులున్నా వదిలిపెట్టబోమని ప్రెస్మీట్లో ప్రకటించారు. చెప్పినట్టుగానే సినీ నటుడు నా గార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌పై ఈనెల 21న సినిమాటోగ్రఫి మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే హైడ్రా శరవేగంగా తన పని పూర్తి చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు సినీ పెద్దలు మంత్రిని కలవకపోడమే నేడు కూల్చివేతలకు దారి తీసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జీవో 111లో ఒక్కటీ కూల్చనియ్యం
జీవో 111 పరిధిలో ఏ ఒక్క నిర్మాణాన్నీ కూల్చనీయమని, ఒక్క నిర్మాణం కూల్చివేసినా పూర్తి బాధ్యత తనదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్‌నగర్ గ్రామ రెవె న్యూ పరిధిలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య, చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామన భీమ్భరత్తో కలిసి వచ్చారు. జీవో 111 పరిధిలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారని స్థానిక నేతలు చెప్పడంతో మంత్రి స్పందించారు. ఆ నిర్మాణాల జోలికి వెళ్లొద్దని అధికారులను ఆదేశించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.