Jupally Krishna Rao | తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి.. మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు
Jupally Krishna Rao | తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
Jupally Krishna Rao | తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో మంత్రి జూపల్లి ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
పీపీపీ విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, హెరిటేజ్, మెడికల్, వెల్ నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా నూతన పర్యాటక విధానాన్ని రూపొందించామని వివరించారు. రాష్ట్రంలో 2030 నాటికి రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలనే ఆశయంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

