హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రతి ఉద్యోగి నిబద్ధత, బాధ్యతతో పనిచేసి ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆబ్కారీ భవన్లో మంగళవారం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిషరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసీజర్ను తయారు చేసుకొని సమర్థతను పెంచుకోవాలని, తద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు తదితర అంశాలను మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలు న్యాయ సమ్మతమైనవని, వాటిని పరిషరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.
ప్రమోషన్లలో వివక్షవాణిజ్య పన్నులశాఖ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నిరసన
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రమోషన్లలో తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ హైదరా బాద్లోని వాణిజ్య పన్నులశాఖ కమిష నర్ కార్యాలయం ఎదుట వాణిజ్య ప న్నుల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళ వారం మధ్యాహ్న భోజన విరామ సమ యంలో నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షు డు కే భీక్యా, ప్రధాన కార్యదర్శి కే నాగేం దర్, సహ అధ్యక్షుడు బీ శ్యామ్, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.