Liquor Brands | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహానికి కారణం ఏమిటి? మంత్రి చేసిన హెచ్చరికలు అధికారులకా? మరెవరినైనా టార్గెట్ చేశాయా? మంత్రికే తెలియకుండా ఎక్సైజ్ శాఖను ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉన్నది? కొత్త బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ‘రింగ్ మాస్టర్’ ఎవరు? ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అనుమతి వ్యవహారం ప్రభుత్వంలో చిచ్చుపెట్టినట్టే కనిపిస్తున్నది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా తయారై ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో దుమారం రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సౌమ్యుడిగా పేరున్న ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అటో ఇ టో తేల్చేయాలని పట్టుదలతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులు మంత్రికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమని అధికారవర్గాలు చెప్తున్నా యి. ఇదే సమయంలో మంత్రిని సైతం బైపాస్ చేసి విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ తతంగం మొత్తాన్ని ప్రభుత్వంలోని అత్యంత కీలక వ్యక్తి సన్నిహితుడు నడిపినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ వ్యక్తే ‘రింగ్ మాస్టర్’గా మారి చక్రం తిప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హెచ్చరికలు ‘పైన’ వ్యక్తులకేనా?
మంత్రి జూపల్లి ఆగ్రహానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏ శాఖలోనూ ఏ మం త్రి చేయని విధంగా ఏకంగా ఐదు గంటలపా టు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, సమావేశంలో ఘాటు వ్యా ఖ్యలు చేయడానికి బలమైన కారణం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లకు అనుమతుల ప్రక్రియ జూపల్లికి తెలియకుండా జరిగిందని ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన గత మే 21న ప్రెస్‌మీట్ పెట్టి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని చెప్పడమే కాకుండా, మీడి యా సంస్థలపై కేసులు పెడతామని బెదిరించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తీరా, కొత్త బ్రాండ్లకు అనుమతులు నిజమేనని తెలిసిన తర్వాత కంగుతిన్నారని, వారం రోజులకే తన వ్యాఖ్యలపై తానే వివరణ ఇచ్చుకోవాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్తున్నారు. తనకే తెలియకుండా నిర్ణయాలు జరిగిపోవడాన్ని మంత్రి అవమానంగా భావించారని, రాష్ట్ర ప్రజలందరి ముందు తన పరువు పోయిందని తీవ్రంగా బాధపడ్డారని చెప్పుకుంటున్నారు. కొత్త బ్రాండ్లకు ఎవరు అ నుమతులు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో నివేదిక తయారుచేయాలని ఆదేశించారని గుర్తుచేస్తున్నారు. ఈ హెచ్చరికలు అధికారులను ఉద్దేశించినవి కాదని, వారిని ప్రభావితం చేసిన ‘రింగ్ మాస్టర్’కే అని చర్చ నడుస్తున్నది.
మింగలేక.. కక్కలేక..
ఎక్సైజ్ ఉన్నతాధికారుల పరిస్థితి ‘మింగలేక.. కక్కలేక’ అన్నట్టుగా తయారైందని చర్చ జరుగుతున్నది. మంత్రినే బైపాస్ చేసి నిర్ణయా లు అమలు చేసే శక్తి ఉన్నవారి పేర్లను బయట పెట్టలేక, మంత్రికి సర్దిచెప్పలేక నానా అవస్థలు పడుతున్నారని ఎక్సైజ్‌శాఖ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మంత్రి ఆదేశం మేరకు ఎవరు, ఎలా అనుమతులు ఇచ్చారో ‘సాంకేతికంగా’ ని వేదిక సిద్ధం చేస్తున్నారని, అంతేతప్ప ఈ తతం గం వెనుక ఎవరున్నారనే అంశంపై ఎవరూ పెదవి విప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులపై వేటు వేసి కప్పిపుచ్చుకునే ప్రయ త్నం చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం ఇప్పుడు నాలుగు గోడల మధ్య లే దని, ప్రజల్లోకి వెళ్లిపోయి చర్చ జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ లో ఆందోళన మొదలైనట్టు సమాచారం. ఒక వ్యక్తి చేసిన నిర్వాకం అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీ మెడకు చుట్టుకుంటున్నదని, పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే, ప్రభుత్వంలో మంత్రి పదవులకు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ మండిపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్రమంగా అలవాటు చేసేలా వ్యూహం?
కొత్త బ్రాండ్లకు అనుమతుల నిలుపుదల తాత్కాలికమేనని ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతున్నది. కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చేముందు కావాలనే ప్రముఖ బ్రాండ్ల సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అంటున్నారు. అందుకే పలుచోట్ల ప్రీమియర్ బీర్లు సరఫరా చే యాలంటూ ఏకంగా ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తిందని ఉదహరిస్తున్నారు. ప్రజలకు క్రమంగా కొత్త బ్రాండ్లు అలవాటు చేసేందుకే ఇలా చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. ప్రీమియం బ్రాండ్ల మద్యం దొరకకపోతే రెండుమూడు రోజులు వెనక్కి వెళ్లిపోతారని, నాలుగో రోజు ‘ఉన్నదే ఇచ్చెయ్’ అంటూ ఏది ఇస్తే అది తీసుకొని వెళ్లిపోతారని సీనియ ర్ లిక్కర్ వ్యాపారి ఒకరు చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని రోజులకు కొత్త బ్రాండ్లకు అనుమతులు పునరుద్ధరించి ప్రజలకు అలవాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.