Minister Jagdish Reddy | కాంగ్రెస్ గెలుపొందడం అంటే..తోడేళ్ల మంద గొర్రె పిల్లలపై పడ్డట్టే : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagdish Reddy | యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉండబోతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సోమవారం కుడకుడ గ్రామంలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సూర్యాపేట : యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉండబోతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సోమవారం కుడకుడ గ్రామంలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సూర్యాపేట కార్పెంటర్స్ నూతన కార్యవర్గ పదవీ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చామని అన్నారు. సూర్యాపేటలో పారిశ్రామిక హబ్ నెల కొల్పడమే తన భవిష్యత్ లక్ష్యం ఆన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్న మంత్రి కాంగ్రెస్ గెలుపొందడం అంటే..తోడేళ్ల మంద గొర్రె పిల్లలపై పడటమే అన్నారు.
గత మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే మహిళా సంఘాల అభివృద్ధి జరిగిందన్న మంత్రి పనిచేసే ప్రభుత్వానికి సబ్బండ వర్గాలు అండగా నిలబడాలని కోరారు. మరోసారి శాసన సభ్యుడిగా ఆశీర్వదించండి… సేవకుడిగా పనిచేస్తానని హామినిచ్చారు.అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

