నల్లగొండ : సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో
ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రజలు మోదీని నిలదీస్తున్నారు. తెలంగాణలో అమలు అయ్యే పథకాలు నువ్వు ఎందుకు అమలు చేయడం లేదని ప్రధానిని నిలదీస్తున్నారు. అందుకే మోదీ తెలంగాణ పై విషం కక్కుతున్నారని ఆయన మండిపడ్డారు.
గుజరాత్లో రైతులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6 గంటల కరంట్కు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి తెలంగాణలో కేసీఆర్ అన్నదాతలకు 24 గంటల ఉచిత కరంట్ ను, ఇస్తున్నారు.
నువ్వు ఎందుకు ఇయ్యావ్ అని గుజరాత్ రైతులు మోదీని ప్రశ్నిస్తున్నారు.
ఆసరా పెన్షన్లు కూడా తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇవ్వాలని దేశ ప్రజలు మోదీని నిలదీస్తున్నారు. దీంతో దేశంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు లేవని గ్రహించిన మోదీ కేసీఆర్ పై కక్ష్య కట్టిండు.
అందుకే ఎలాగైనా కేసీఆర్ పని పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి అనే దొంగను అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్లు కుట్రలకు తెరలేపారు. మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,
చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.