సూర్యాపేట: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు శనివారం ఆయన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు.
గతంలో స్టడీ సర్కిల్ ఎక్కడో ఒకటి ఉండేదని, అందులో ఉద్యోగార్థులకు సీటు సంపాదించడమే చాలా కష్టంగా ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ముందుచూపు కారణంగా 33 జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో సూర్యాపేటలోనే మొదట స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
స్టడీ సర్కిళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. వీటిని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధించేవరకూ పాజిటివ్ దృక్పథంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానందరాణి, తదితరులు పాల్గొన్నారు.