పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish reddy | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు.
హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్లో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.

పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గత మూడేండ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కిషోర్ కుమార్, రవీందర్ నాయక్, పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ కార్యాలయం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షల వెళ్లువ..
మంత్రి జగదీవ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి.. జగదీశ్వర్ రెడ్డితో కేక్ కట్‌చేయించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

