Minister Jagadish Reddy | కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏనాడూ అభివృద్ధికి నోచుకో లేదని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సుభీక్షంగా ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం తాళ్ల ఖమ్మం పహాడ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. సుమారు రూ.80లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హల్, బస్ షెల్టర్, ఓపెన్ జిమ్‌లను మంత్రి ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు తెలంగాణలో కరాళ నృతం చేసిన ఆకలి దరిద్య్రాలను సీఎం కేసీఆర్ పారద్రోలారన్నారు.
ప్రజల కడుపు కొట్టుడు కాంగ్రెస్, బీజేపీ కల్చర్ అయితే.. అన్నం పెట్టుడు బీఆర్ఎస్ సంస్కృతి అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో 30శాతం మంది ప్రజలకు ఒంటి పూట భోజనంతోనే సరిపెట్టుకున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ప్రతీ గింజను తానే కొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు తోటి వారు చనిపోతే నే తప్పా పెన్షన్ రాక సొంత కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకొని పెద్దలకు రూ.2వేల ఆసరా పెన్షన్ ఇచ్చి సరైన గౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నేటికీ ఇచ్చే పెన్షన్ రూ.600 మాత్రమేనన్నారు. ఎకరం ఉన్న రైతు పంట పండించే రైతు నెలకు రూ.వెయ్యికిపైగా కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందన్నారు. అబద్ధాలు, మాయమాటలు చెప్పేందుకు గ్రామాల్లోకి వస్తున్న వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడికక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట పట్టణంఓలని 48వ వార్డ్ కూరగాయల మార్కెట్లో నూతనంగా నిర్మించిన లతీఫీయ మజీద్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకులా చూశాయని, సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. నూతన మజీద్ ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.