హైదరాబాద్ : అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదినం సందర్భంగా మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరగాలని ఆశిస్తున్నా’అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. భగవంతుడి దీవెనలతో మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు.