నార్కట్‌పల్లి, ఏప్రిల్ 28 : నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి నర్సింహ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఎమ్మె్ల్యే లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. చిరుమర్తిని ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.