నిర్మల్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్మల్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ముఖ్యమంత్రి మానవత్వాన్ని చాటారన్నారు. అంతకుముందు నిర్మల్‌లోని బస్‌డిపో వద్ద కూలీలు సంబరాలు చేసుకున్నారు. విలీనానికి గుర్తుగా పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లోని డిపోల్లో సైతం ఆర్టీసీ సిబ్బంది కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.