నిర్మల్ : విద్యార్థుల్లో ఆకలి బాధలు లేకుండా చేసి పిల్లలు పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ నియోజకవర్గం సోన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి ఆల్పాహారం పథకాన్ని ప్రారంభించి చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు.
అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్ఫాస్ట్ వడ్డించిన మంత్రి తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మానవీయ కోణంలో పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిందే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.