రాజకీయ భవన్‌లా రాజ్‌భవన్!
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో
రామ్‌లాల్ దుస్థితి రాకుండా చూసుకోవాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హితవు
నిర్మల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీ ఇంచార్జిగా పనిచేసిన తమిళిసై ఇక్కడ కూడా బీజేపీకి వంతపాడుతూ ఆ పార్టీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఎన్టీఆర్ హయాంలో ఇలాగే వ్యవహరించిన అప్పటి గవర్నర్ రామ్‌లాల్‌కు ఎదురైన పరిస్థితే తమిళిసైకి కూడా ప్రజల తిరుగుబాటు రూపంలో ఎదురవుతుందని అన్నారు. ఇకనైనా గవర్నర్ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని పథకాలపై ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం దేశానికి ఎంతైనా ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

