ఆదిలాబాద్, మే 6( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్‌లో 5 లక్షల మందితో సభ పెడతామని చెప్పుకొన్న కాంగ్రెస్ నేతలు 40 వేల మందిని కూడా సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేదనడానికి ఈ సభ నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర నాయకులు రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ చదివారని ఎద్దేవా చేశారు.
సభకు వచ్చిన వారు వెళ్లిపోతుండటంతో ముందగానే రాహుల్‌తో మాట్లాడించారని పేర్కొన్నారు. సీనియర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, పలువురు హాజరుకాకపోవడం ఆ పార్టీలో వర్గపోరుకు నిదర్శనమని చెప్పారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ నేతలు సభల పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.